ప్రతి ఆడపిల్లకు పెళ్లి ఆపైన మాతృత్వం రెండు జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలే. ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనివ్వడం అంటే మాములు విషయం కాదు.. గర్భధారణ సమయంలో మహిళల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సమస్యలలో ఎక్టోపిక్ గర్భం ఒకటి. దీని లక్షణాలు, ప్రమాదాలు, చికిత్స ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి.?
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఫలదీకరణం గర్భాశయంతో జరగదు. అది ఫెలోపియన్ ట్యూబ్ లేదా పొత్తికడుపు కుహరం లేదా గర్భాశయ ముఖద్వారంలో జరుగుతుంది. దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ప్రకారం 50 మంది మహిళల్లో ఒకరికి ఇలా జరుగుతుందని పేర్కొన్నారు..
ఎక్టోపిక్ గర్భం లక్షణాలు
కడుపు నొప్పి, వాంతులు
తేలికపాటి లేదా భారీ రక్తస్రావం
తీవ్రమైన కడుపు తిమ్మిరి
మైకము లేదా బలహీనత
అధిక చెమట
లేత చర్మం, రక్తహీనత, మూర్ఛ,
భుజంలో నొప్పి, శరీరం భాగాలలో నొప్పులు ఉంటాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు
ఇలా గర్భంరావడానకి కారణం… ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్‌ఫ్లమేషన్, కొన్ని కారణాల వల్ల ట్యూబ్ దెబ్బతినడం, ఫలదీకరణం అయిన అండం అసాధారణంగా అభివృద్ధి చెందడం, హార్మోన్ అసమతుల్యత, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, 35 సంవత్సరాల తర్వాత గర్భం, పెల్విక్ సర్జరీ వల్ల మచ్చ కణజాలం, సంతానోత్పత్తి మందులు ఎక్కువగా వాడటం, లేదా IVF వల్ల ఇది ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించడం అనేది అంత సులభం కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు పదే పదే నొప్పి ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి. వారు చెక్ చేసి నిర్ధారిస్తారు. గర్భధారణ సమయంలో వచ్చే సాధరణ నొప్పులను అశ్రద్ధ చేయకండి..ఏమాత్రం అనారోగ్య సమస్య ఉన్నా ఇంటి వైద్యం కాకుండా ఈ సమయంలో వైద్యులను సంప్రదించి లోపల బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటూ ఉండాలి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చికిత్స ఈ క్రింది విధంగా చేస్తారు.
గర్భధారణ తొలినాళ్లలో కనుక గుర్తించినట్లైతే మెథోట్రెక్సేట్ ఇచ్చి ఫెలోపియన్ ట్యూబుకు హానికలిగించకుండా చేస్తారు. గర్భధారణ కణజాలాన్ని శరీరం శోషించుకుంటుంది.
కొందరిలో ఫెలోపియన్ ట్యూబులు అధికంగా సాగిపోవడం లేదా చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. ఇటువంటి కేసులలో ఫెలోపియన్ ట్యూబును పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించవలసి వస్తుంది. ఇటువంటి సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సివస్తుంది. .
లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా లాపరోస్కోప్ ను ఉపయోగించి వైద్యులు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఫెలోపియన్ ట్యూబల నుండి గర్భసంచిలోనికి ప్రవేశపెడతారు. సాధారణ అనస్థీషియా ఇచ్చి ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ పద్ధతిలో ఫెలోపియన్ ట్యూబులను సరిచేయడం లేదా తొలగించడం కూడా చేస్తారు. ఒకవేళ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స విఫలమైనట్లైతే కనుక లాపరోటమీ చేస్తారు.
కొన్ని కేసులలో, ఎక్టోపిక్ గర్భధారణ ఒకసారి జరిగితే తరువాత సాధారణ గర్భధారణ జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. అయినప్పటికీ మీ వైద్యునితో చర్చించి వారి సహాయంతో సంతానోత్పత్తి చికిత్స తీసుకుంటే సాధారణంగా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.