ఎమ్మెల్యేనే మోసపోతే.. ఇక తమ పరిస్థితి ఏంటి..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాల బెడద రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే అయితే.. ఇప్పటివరకు నకిలీ విత్తనాల ద్వారా సాధారణ రైతులు మోసపోయి లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించడం చూశాము కానీ ఏకంగా ప్రజలందరి పంటలకు రక్షణ కల్పిస్తు.. నకిలీ విత్తనాల బెడద అరికట్టాల్సిన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నకిలీ విత్తనాల ద్వారా మోసపోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది .

ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను పండించిన 14 ఎకరాల్లో ఐదెకరాల్లో నకిలీ విత్తనాలు ద్వారా వంట నష్టపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఇక ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలో మునిగిపోతున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సైతం నకిలీ విత్తనాల ద్వారా మోస పోతే ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు రైతులు. అటు ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version