చిన్నపిల్లలకు వచ్చే అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ అంటే ఏంటి..? చికిత్స ఉందా..?

-

అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా..హెయిర్‌ మీద చాలా శ్రద్ధ ఉంటుంది. అది గ్రోత్‌ బాగుండాలి,మంచి స్టైల్లో కట్‌ చేయించుకోవాలి అని.. బయటకు వెళ్తుంటే..వేసుకునే డ్రస్‌సెలక్షన్‌ కంటే..హెయిర్‌ స్టైల్‌మీద ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తాం. చింపిరి చింపిరిగా ఉంటే అస్సలు నచ్చదు. కానీ చిన్నపిల్లల్లో కొంతమందికి..ఎన్నిసార్లు జట్టు దువ్వినా..అది గాలివాన వచ్చి కరాబ్‌ అయిన గ్రౌండ్‌లెక్క పిచ్చిపిచ్చిగా తయారవుతుంది. అసలు వీడు తలలో దువ్వెన పెడతాడా అన్నట్లు ఉంటుంది. ఇది వారి జుట్టు తత్వం.. అయితే దీన్నే వైద్య పరిభాషలో.. అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (UHS) అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ గల పిల్లల జుట్టు పొడిగా, చిట్లినట్లు, నిక్కబొడిచినట్లు ఉంటుంది. గంటల కొద్దీ వారి జుట్టును దువ్వినా ఆ హెయిర్ అనేది నిక్కబొడిచినట్లే ఉంటుంది.

అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌కి కారణమేమిటి?

అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌ జెనటిక్ ముటేషన్ల వల్ల వస్తుంది. ఈ సిండ్రోమ్‌ గల పిల్లలు సాధారణంగా ఆటోసోమల్ రిసెసివ్ ఇన్‌హెరిటెన్స్‌ ద్వారా జన్యువులను వారసత్వంగా పొందుతారు. ఇందులో జెనటిక్ మ్యుటేషన్‌ తల్లిదండ్రులిద్దరిలో ఉంటుంది. ఆటోసోమల్ డామినెంట్ ఇన్‌హెరిటెన్స్‌ ద్వారా కూడా పిల్లలకు ఈ సమస్య రావచ్చు. ఈ సందర్భంలో తల్లిదండ్రులలోని ఒకరి మ్యుటేటెడ్ జీన్ పిల్లలకు పాస్ అవుతుంది. అలా జన్యువులో వచ్చిన మార్పు అనేది పిల్లల్లో జన్యుపరమైన డిజార్డర్‌కు కారణమవుతుంది..

ఎందుకు వస్తుంది?

మూడు జన్యువుల ముటేషన్ల కారణంగా అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌ వస్తుంది. ఈ హెయిర్ గ్రోత్ సిండ్రోమ్ వల్ల తలపై అన్ని వైపులా జుట్టు పైకి లేస్తుంది. UHS ఉన్న పిల్లల జుట్టు వెండి, గడ్డి రంగులో కనిపిస్తుంది. ఈ హెయిర్ చిక్కులు కడుతూ ఉంటుంది. మెలనిన్ లేకపోవడంతో దువ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రుగ్మత 2-11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలలోనే బాగా కనిపిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మెరుగుపడుతుంది.

చికిత్స ఉందా?

UHSకి అధికారిక చికిత్స లేదు. ఈ సమస్య ఉన్న చాలా మందికి యుక్తవయస్సులోకి రాగానే ఈ కండిషన్ దానంత అదే పరిష్కారం అవుతుంది. UHS ఉన్న పిల్లలకు ఇది ప్రమాదకరం కాదు. కాకపోతే ఈ జుట్టును స్టైల్‌గా దువ్వుకోవడం, సంరక్షించుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

UHS ఉన్న రోగుల జుట్టును చాలా సున్నితంగా బ్రష్ చేయాలి.
బలవంతంగా ఉపయోగించి దువ్వకూడదు.
విరిగిపోకుండా ఉండటానికి, జుట్టును వేడి చేయకూడదు.
బ్లో డ్రైయింగ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
హాని చేసే కెమికల్స్ కూడా వాడకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version