వయాగ్రాతో పనేంటి..ఇవి రోజు తింటే..? వెంటనే డైట్‌లో చేర్చేయండి..!!

-

బంధం బలపడాలంటే.. మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా దగ్గరవ్వాల్సిందే.. ఒక వ్యక్తితో శారీరక సంబంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. వారిద్దరి ముధ్య రిలేషన్‌ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే వివిధ కారణాలు వల్ల లైంగిక సామార్థ్యం నేటి యువతలో తక్కువగా ఉంటుంది. దీంతో.. మందులు వాడాల్సి వస్తుంది. వయాగ్రాతో ఉత్సాహంగా సెక్స్‌లో పాల్గొనొచ్చేమోకానీ.. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు..! ఇప్పుడు చెప్పుకునేవి డైలి తినడం వల్ల వయాగ్రాతో పనిలేకుండానే చెలరేగిపోవచ్చు..

జీడిపప్పు: జీడిపప్పులో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు, సెలీనియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఇవన్నీ మీ లైంగిక చర్య ఎక్కువ సేపు జరిగే శక్తిని అందిస్తాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ లిబిడోను పెంచుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో తేలింది..

పైన్ నట్స్: జింక్‌ అధికంగా ఉండే పైన్ గింజలు లైంగిక శక్తిని, లిబిడో స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పైన్ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ ఆరోగ్యకరమైన వీర్య కణాల ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా లైంగికంగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి, మీ లైంగిక శక్తిని పెంచుకోవడానికి పైన్ గింజలను మీ డైట్‌లో చేర్చేసుకోండి.

వేరుశెనగలు- పురుషులకు లిబిడో పెంచే ఆహారాల్లో వేరుశెనగ ఒకటి. వేరుశెనగల్లో ఎల్-అర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించడం ద్వారా లైంగిక పనితీరును పెంచుతుంది. రక్త నాళాలు ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి సహాయపడతాయి.

బాదంపప్పులు- బాదంపప్పులు జింక్, సెలీనియం, విటమిన్ ఇతో కూడిన సూపర్-హెల్తీ ఫుడ్. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంగస్తంభన రాకుండా అడ్డుకుంటుంది.

గుమ్మడికాయ గింజలు- గుమ్మడికాయ గింజల్లో జింక్‌ ఎక్కువగా ఉంటుంది. జింక్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల పురుషుల ప్రోస్టేట్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్ మహిళల్లో సెక్స్ డ్రైవ్‌కు చాలా సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను తినడం వల్ల అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వాల్‌నట్‌లు- వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్, అర్జినైన్ వంటి “ఫీల్-గుడ్ కెమికల్స్”ను పెంచుతాయి. అర్జినైన్ అనేది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి పనికొచ్చే అమైనో ఆమ్లం. అంగస్తంభన కాకుండా నైట్రిక్ ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. ఇది మీ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version