అమెరికాలో ఏం జరుగుతుందో తెలిస్తే కన్నీళ్లు పెడతారు…!

-

కరోనా వైరస్ తీవ్రతకు అమెరికా భయపడిపోతుంది. అక్కడి ప్రజలకు ఇప్పుడు ప్రాణంతో ఉంటే చాలు అన్నట్టు ఉంది. ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా వస్తే ఏమీ కాదు లే అనుకున్న అమెరికా ఇప్పుడు ప్రాణాల కోసం చాలా పోరాడుతుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అక్కడ కరోనా కేసుల సంఖ్య అనేది తగ్గడం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.

బ్రతికే అవకాశం ఉంటేనే ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకుంటుంది. ముందు పరిక్షలు చేసిన తర్వాత బ్రతికే అవకాశం ఉందీ అనుకుంటేనే వాళ్ళను వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి ఉంది అక్కడ.వృద్దులులను అయితే కనీసం ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి కనపడటం లేదు. న్యూయార్క్‌ పక్కనే ఉన్న న్యూ జెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాలకు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో కనీసం 9 లక్షల వెంటిలేటర్లు కావాలి. ప్రస్తుతం ఉన్నవి 2.25 లక్షలే దీనితో బ్రతికే అవకాశం ఉంటే ఆస్పత్రి.

ఇప్పుడు అక్కడ పెద్దల కంటే పిల్లలను కాపాడటం అనేది చాలా కీలకం. ఐసీయూలో పెట్టినా, వెంటిలేటర్‌ అమర్చినా బతకరు అనే వాళ్ళను పక్కకు తోసేస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో రాష్ట్రంలోనే కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య దాదాపు 60వేలకు పెరిగింది. సుమారు వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి ప్రభుత్వం ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version