వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందితో..!

-

ఎప్పటికప్పుడు వాట్సాప్ లో కొత్త ఫీచర్లు వస్తూనే ఉంటున్నాయి. వాట్సాప్ ఫీచర్స్ తో ఎన్నో లాభాలని యూజర్లు పొందొచ్చు ఎప్పుడూ కూడా వాట్సాప్ కొత్త ఫీచర్ల తో అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. దిగ్గజ ఇన్స్టెంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ ఇంకో సారి అప్డేట్ ని తీసుకొచ్చింది. ఒక కొత్త ఫీచర్ పై కీలక ప్రకటన చేసింది.

కొత్త అప్డేట్ ప్రకారం చూసినట్లయితే వాట్సాప్ కొత్త ఫీచర్ ని ఇప్పుడు పిసిలో తీసుకు వచ్చింది. ఏకంగా 32 మందితో ఒకే సారి వీడియో కాల్స్ చేయొచ్చు. 32 మంది పార్టిసిపెంట్స్ తో బీటాలో వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. జూమ్ వంటి వాటి అవసరమే లేకుండా వాట్సాప్ ద్వారా ఏకంగా 32 మందితో వీడియో కాల్ చేసుకోవచ్చు.

గ్రూప్ కాల్ లో జాయిన్ అవ్వాలని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా బీటా యూజర్లు ఈ కాల్ లో చేరవచ్చు ఇలా ఇప్పుడు ఏకంగా 32 మంది వరకు ఈ వీడియో కాల్ లో జాయిన్ కావచ్చు. రానున్న రోజుల్లో దీనిని యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. బీటా టెస్టర్స్ కి మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news