వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సోషల్ మీడియా యూజర్లు షాక్ గురైనారు. గత రాత్రి వాట్సప్ వినియోగదారులు అనేక మంది మెసేజ్‌లు సెండ్, రిసీవ్ చేయలేకపోయామని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. స్టేటస్ వీడియోలు కూడా అప్‌లోడ్ చేయలేకపోయామని అనేక మంది వినియోగదారులు ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఫేస్‌బుక్ మాత్రం బాగానే పని చేస్తోందని పలువురు చెప్పారు.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు, ఫేస్‌బుక్‌లో ఫీడ్ రీఫ్రెష్ కూడా కాలేకపోయాయని వినియోగదారులు నుంచి అసహనం వ్యక్తమైంది. శుక్రవారం రాత్రి 10.55 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. అయితే 11:24 గంటల సమయంలో ఈ సోషల్ మీడియా యాప్స్ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, గతేడాది కూడా ఫేస్ బుక్ సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయిన విషయం విదితమే.
అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా సర్వీసులు నిలిచిపోవడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ అంశంపై వాట్సాప్ స్పందించింది. సర్వీసులు నిలిచిపోవడంతో సహనం వహించిన వినియోగదారులకు ధన్యవాదాలు అని ఓ ప్రకటన విడుదల చేసింది. 45 నిమిషాల్లో సేవలు పునరుద్ధరించామంటూ తెలిపింది.
అయితే సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైన విషయం తెలిసిందే. ఒక్కసారిగా సేవలన్నీ నిలిచిపోవడంతో అందరూ కాస్త గందరగోళానికి గురయ్యారు. వినియోగదారులు అసలు సమస్య ఫోనా? లేకా నెట్వర్క్ సమస్యా? అనేది తెలియక అయోమయానికి గురయ్యారు. అనేక మంది వినియోగదారులు సైతం యాప్‌లను అన్ ఇన్సా్టల్ చేసుకుని మళ్లీ ఇన్సా్టల్ చేసుకున్నారు. కొంత మంది సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై చాలానే చర్చ జరిగింది. ఎట్టకేలకు సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో అంతా రిలాక్స్ అయ్యారు.