వాట్సాప్‌ నోటిఫికేషన్‌ సమస్యలకు చెక్‌!

-

ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. మీ స్మార్ట్‌ఫోన్లకు వచ్చే వాట్సాప్‌ నోటిఫికేషన్లు మీకు తలనొప్పిగా మారితే ఈ సమస్యకు చెక్‌ పెట్టే కొత్త ఫీచర్‌ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

వాట్సాప్‌ / whatsapp

గ్రూప్‌ కాల్స్‌ మిస్‌ అయినవారికి మరో ఫీచర్‌ అందిస్తోంది వాట్సప్‌. మిస్డ్‌ గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌తో మీరు మిస్‌ అయిన గ్రూప్‌ కాల్స్‌లో ఈజీగా చేరొచ్చు. ఇక ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతోంది వాట్సప్‌. ప్రస్తుతం గ్రూప్స్‌కి మాత్రమే ఉన్న ఫీచర్‌ను అన్ని ఛాట్స్‌కు అమలు చేయనుంది. వాట్సప్‌ ఇన్‌ యాప్‌ నోటిఫికేషన్‌ మెనూను రీడిజైన్‌ చేసింది . నోటిఫికేషన్‌ బ్యానర్‌లోనే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇమేజెస్, వీడియోస్‌లాంటి వివరాలన్నీ నోటిఫికేషన్‌ మెనూలోనే తెలుస్తాయి.

ఇప్పటికే వ్యూ వన్‌ ఫీచర్‌ను వాట్సప్‌ అందిస్తోంది. దీని ద్వారా ఏదైనా ఫోటో లేదా వీడియో వాట్సప్‌లో వస్తే డౌన్‌ లోడ్‌ చేయకుండా చూడొచ్చు. అవసరం అనుకుంటేనే డౌన్‌ లోడ్‌ చేసి సేవ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు త్వరలో హైక్వాలిటీ వీడియోలు పంపే ఫీచర్‌ రూపొందిస్తోంది వాట్సప్‌. వాట్సాప్‌ అందించనున్న మరో అద్భుతమైన ఫీచర్‌ మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌. ఈ ఫీచర్‌ను చాలాకాలంగా టెస్ట్‌ చేస్తోంది వాట్సప్‌. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌లో వచ్చే ప్రతీ మెసేజ్‌ను చదువుతూ పోతే టైమ్‌ సరిపోదు. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు అవసరం లేని మెసేజెస్‌ వస్తుంటాయి. అలాంటి మెసేజెస్‌ తర్వాత చదవడానికి రీడ్‌ లేటర్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. తన సరికొత్త ఫీచర్లతో ఇతర మెసేంజర్‌ యాప్‌లకు పోటీ గట్టిగానే ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version