వాట్సాప్-పే ఫీచర్.. డబ్బుతో పాటు పెన్షన్ కూడా !

-

వాట్సాప్ తన కొత్త ఫీచర్ ను అభివృద్ధి పరిచింది. భారత దేశ వ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులో తీసుకురావడానికి ప్రణాళికను రచిస్తోంది. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ తన కొత్త ఫీచర్ వాట్సాప్-పే ఆప్షన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించుకుంది.

media-handler
media-handler

గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్ కంపల్సరీ. సమాచారం అందించడానికి, వీడియో కాలింగ్, ఫోటో షేరింగ్, పీడీఎఫ్ ఫైళ్ల షేరింగ్ తదితర ఫీచర్లతో వాట్సాప్ అందుబాటులో వచ్చాయి. దీంతో ప్రతి ఒక్కరూ వాట్సాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి.

తాజాగా వాట్సాప్ తన సేవల్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇన్ స్టెంట్ మెనేజింగ్ సేవలకే పరిమితమై వాట్సాప్ ఇప్పుడు భారతదేశంలో తన సేవలను మరింత విస్తరించాలని భావిస్తోంది. మైక్రో ఫైనాన్స్ (చిన్న రుణాలు), బీమా, పెన్షన్ వంటి సేవలను వాట్సాప్ లో కూడా ప్రారంభించబోతుందని వెల్లడించింది. ఈ సేవలకు గానూ పైలట్ ప్రాజెక్టు 2018లోనే ప్రారంభమైంది.

ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి భారతదేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల వంటి భాగస్వాములతో కలిసి పని చేయనుందని సంస్థ ప్రకటించుకుంది. వాట్సాప్ కంపెనీ అధినేత అభిజీత్ బోస్ బుధవారం వాట్సాప్-పే ఫీచర్ గురించి తెలిపారు. ఆర్థిక లావాదేవీల సమస్యలను పరిష్కరించే దిశగా కంపెనీ ముందుకు అడుగులు వేస్తోందని, వివిధ కార్యక్రమాలకు కంపెనీ మద్దతుగా ఉంటోందని వెల్లడించారు.

గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్’లో నిర్వహించిన కార్యక్రమంలో ఫేస్ బుక్ యాజమాన్యంతో చేతులు కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వాట్సాప్-పే ఫీచర్ అధికారింగా వినియోగంలోకి రాలేదని, ఆర్బీఐ నియమ నిబంధనలు పూర్తయిన తర్వాత ఫీచర్ అందుబాటులోకి వస్తుందన్నారు. యూపీఐ ఆధారిత సేవలు, డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి అనుమతిస్తుంది.

ఇప్పటికే అమలులో ఉన్న పేటీయం-సాఫ్ట్ బ్యాంక్, ఫోన్ పే- ఫ్లిప్ కార్డ్, గూగుల్ సంబంధిత గూగుల్ పేలకు అనుగుణంగా త్వరలో వాట్సాప్-పే కూడా పోటీ చేయనుంది. నియంత్రణ పరిమితుల కారణంగా కంపెనీ ఈ సేవలను భారతదేశంలో పూర్తిగా అమలు చేయలేకపోతున్నామని, నిబంధనలు పూర్తి చేసుకున్న తర్వాత సేవలు అందుబాటులో వస్తాయని వాట్సాప్ కంపెనీ అధినేత అభిజీత్ బోస్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news