వాట్సాప్‌ను ఇప్పటి వరకు ఒకే విధంగా వాడుతున్నాం. అయితే వాట్సాప్ రానున్న రోజుల్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో నాలుగు రకాలుగా మనం వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌లో ఫోన్ డేటా లేకుండానే వెబ్ వర్షన్ పని చేయనున్నట్లు టెక్ వార్గలు తెలిపాయి. అవును మొబైల్, వైఫై లేకుండానే వాట్సాప్ పని చేస్తుంది. మల్టీ డివైజ్ సపోర్ట్ తీసుకువస్తామని వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు తెలిస్తోంది.
ఈ కొత్త ఫీచర్‌ను మొదటగా వాట్సాప్ బీటా ప్రోగ్రాంలో తీసుకురానున్నారు. దీంతో మొబైల్ లేకుండానే వాట్సాప్ వెబ్‌ను వాడుకోవచ్చు. వాట్సాప్ దీన్ని వెబ్ బీటా పేరుతో తీసుకురానుంది. ఇది ఎలా వాడాలి అంటే మొదటగా వాట్సాప్ లింక్ ద్వారా బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి.
అప్పుడు మీ ఎంట్రీని వాట్సాప్ ఆమోదిస్తే మీ అకౌంట్‌లో కొన్ని మార్పులు చేస్తారు. అప్పుడు మీ వాట్సాప్ ఈ సరికొత్త వెర్షన్‌కు సిద్ధమైనట్లు అని అర్థం.
- ఇక మీ మొబైల్ డేటా లేదా నెట్ కనెక్షన్ లేకుండానే వాట్సాప్ వెబ్ పని చేస్తుంది.
- వాట్సాప్‌ను ఈ పద్ధతి ద్వారా నాలుగు విధాలుగా వాడుకోవచ్చు.
- కానీ, ఈ బీటా ప్రోగ్రాం వల్ల వాట్సాప్‌ను వాడే సమయంలో మెసేజ్‌లు ఎరేస్ అయిపోతాయి.
- త్వరలో ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది.
- ఈ వెర్షన్ వాడే వినియోగదారులు చాట్ చేసేటపుడు, అవతలి వ్యక్తి కూడా బీటా ప్రోగ్రాంను వాడుతూ ఉండాలి.
- ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్‌కు సంతృప్తికర ఫలితాలు వస్తాయి. ఈ వాట్సాప్ బిజినెస్‌కు కూడా ఉపయోగపడుతుంది.
- లాగిన్ అయిన తర్వాత ఆ మొబైల్‌కు డేటా కనెక్షన్ లేకున్నా కూడా వాట్సాప్ పని చేస్తుంది.