పెళ్లి గురించి అడిగితే బ్రేకప్ గురించి చెప్పి.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!!

-

ఇటీవల కాలంలో హీరోయిన్లు చాలా ధైర్యంగా తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి వెనుకాడడం లేదు. ఒకప్పుడు గుండెలు పగిలిపోయే అంత కష్టం జీవితంలో ఉన్నా.. కెమెరా ముందు మాత్రం ఎలా నటిస్తారో నిజ జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడానికి కూడా వెనుకాడే వారు అని చెప్పవచ్చు. కానీ గతంతో పోల్చుకుంటే వర్తమానంలో కాస్తంత మార్పు కొట్టొచ్చినట్లుగా తెలుస్తోంది. మీడియాకు బదులుగా సోషల్ మీడియా మరింత యాక్టివ్ కావడమే ఇందుకు కారణం.. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకునే దిశగా ఎన్నో విషయాలను అభిమానులతో నేరుగా మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు లైవ్ లోకి రావడం, అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.. నిజాయితీగా ఉంటూ తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్న వైనంతో చాలామంది అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు హీరోయిన్లు. ఈ క్రమంలోనే తాజాగా మరొక హీరోయిన్ సునైనా కూడా సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది. రాజరాజచోర సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్న సునయన తెలుగు ,తమిళ్, మలయాళం , కన్నడ భాషల్లో నటించింది.

తాజాగా ఈమె సోనీ లీవ్ లో చేసిన వండర్ ఉమెన్ ఈరోజు టెలికాస్ట్ కానున్న నేపథ్యంలో ఈమె చర్చించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగానే ఒక అభిమాని మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. ఎవరు ఊహించని విధంగా సమాధానం చెప్పింది.. “ముందు బ్రేకప్ గాయం తగ్గని” అని చెప్పడంతో పాటు.. తాను ఇంకా ఆ బాధ నుంచి బయటకు రాలేదని చెప్పుకొచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారని మరొక అభిమాని అడగగా.. పుస్తకాలు చదవడం వల్ల ఎంతో సాంత్వన ఉంటుందని చెప్పింది. మొత్తానికైతే పెళ్లెప్పుడు అంటే బ్రేకప్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version