భక్తి: తులసి మొక్కకి నీళ్లు ఎప్పుడు పొయ్యకూడదంటే..?

-

ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకి ఏ సమయంలో నీళ్లు పొయ్యికూడదు, ఏ సమయంలో నీళ్లు పొయ్యచ్చు అనే విషయాన్ని చెప్పారు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా ఇప్పుడే చూసేద్దాం.

హిందువులు ప్రతి రోజూ తులసి మొక్కని పూజిస్తారు. అదే విధంగా తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలం నుండి తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తులసి మొక్కకి పూజించడం ఎంత ముఖ్యమో తులసి మొక్కకి నీళ్ళు పోసేటప్పుడు సమయం చూసుకొని పోయడం కూడా అంతే ముఖ్యం.

కొన్ని కొన్ని రోజులు తులసి మొక్కకి నీళ్లు పోయడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కానీ తెలియక చాలా మంది వాళ్లకి వీలు కుదిరినప్పుడు నీళ్లు పోస్తూ ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు తులసి మొక్కకి నీళ్ళు పోయకూడదు అనే విషయానికి వస్తే..

ఆదివారం నాడు, ఏకాదశి నాడు, చంద్ర గ్రహణం నాడు తులసి మొక్కలకు నీళ్లు పోయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఆ రోజుల్లో అసలు తులసి దళాలని కోయకూడదు. ఒకవేళ కనుక ఈ తప్పులు ఎవరైనా చేస్తే సమస్యలు వస్తాయి.

అదే విధంగా గురువారం నాడు పచ్చిపాలు తులసి మొక్కకి పోయడం మరియు నెయ్యితో దీపాన్ని ప్రతి రోజు సాయంత్రం పూట వెలిగించడం వల్ల మంచి కలుగుతుంది అని అంటున్నారు. ఆదివారం నాడు మాత్రం ఇలా చేయొద్దు. అదేవిధంగా ఎండిపోయిన తులసి ఆకులు ఇంట్లో అసలు ఉంచుకోకూడదు. ఇలా తులసి మొక్కకి పూజ చేసే వాళ్ళు ఈ తప్పులు చేయకుండా ఉంటే శుభ ఫలితాలు కనపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news