టాస్‌ గెలిచిన శ్రీలంక ; భారీ మార్పులతో భారత్‌

కొలంబో లోని… ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఇవాళ శ్రీలంక మరియు టీం ఇండియా జట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌ లో శ్రీలంక జట్టు నెగ్గి… మొదటగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీం ఇండియా బ్యాటింగ్‌ చేయనుంది. అటు భారీ మార్పులతో టీం ఇండియా బరిలోకి దిగనుంది.

టీం ఇండియా : శిఖర్ ధావన్ (సి), రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, సంజు సామ్సన్ (ప), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా సమరవిక్రమ, దాసున్ షానక (సి), రమేష్ మెండిస్, వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, అకిలా దనంజయ, దుష్మంత చమీరా