ఈ ఏడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల్లోకి వరద నీరు యథేచ్చగా ప్రవహిస్తోంది. అయితే.. తాజా వరదలతో పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఇవాళ నిండిపోయిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను కాసేపటి క్రితమే అధికారులు ఎత్తారు.
ఏకంగా రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేశారు అధికారులు. ఈ రెండు గేట్ల ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4.56 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 2007 తర్వాత జులై మాసంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 881.5 అడుగులు కాగా.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంది. ఇక అటు శ్రీశైలం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేసింది.