అంతా బాగానే ఉంది… కానీ అక్కడే క్లారిటీ మిస్ కల్యాణ్ బాబు…

-

పవన్ కల్యాణ్…. రాజకీయం చేయడం మొదలుపెట్టారు…అదేంటి ఇంతకాలం పవన్ రాజకీయం చేయలేదా? అంటే ఆయనే అనేశారు కదా… తాను సమాజం కోసం పని చేశానని ఇకనుంచి రాజకీయం చేస్తానని. కాబట్టి ఇకనుంచి కల్యాణ్ బాబు రాజకీయాలు మొదలుపెట్టబోతున్నారు…. అంటే కల్యాణ్‌లో అసలైన రాజకీయ నాయకుడుని చూడబోతున్నాం.

అందుకే పవన్ తాజాగా జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు..అలాగే వైసీపీ వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించారు…ఏ సైజులో యుద్ధం కావాలన్న చేయడానికి సిద్ధమని పవన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక క్లారిటీగా చెప్పాలంటే నెక్స్ట్ ప్రభుత్వాలు మారబోతున్నాయని, వైసీపీ 151 సీట్ల నుంచి 15 సీట్లకు రావొచ్చని కూడా కల్యాణ్ చెప్పారు. అలాగే నెక్స్ట్ అంటే 2024 ఎన్నికల్లో జనసేన విజయ ఢంకా మోగించబోతుందని బాగా కాన్ఫిడెంట్‌గా చెప్పారు…ఇప్పుడు వైసీపీ కౌరవ సభ ఏంటో చూపించిందని, నెక్స్ట్ పాండవ సభ ఎలా ఉంటుందో అసెంబ్లీలో చూపిస్తానని అన్నారు.

అంటే నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి రాదనే పవన్ తేల్చి చెప్పేస్తున్నారు. అలాగే ఇప్పుడు తమని ఇబ్బంది పెట్టిన ప్రతి నాయకుడుని అప్పుడు మోకాళ్ళ మీద నిలబెడతానని అన్నారు. ఈ విషయంలో పవన్ బాగా క్లారిటీగా ఉన్నారు గానీ, అసలు విషయంలో మాత్రం జనసైనికులకు కావొచ్చు, మిగిలిన అభిమానులకు కావొచ్చు పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే పవన్…వైసీపీ ఓడిపోతుందని, ప్రభుత్వం మారుతుందని అంటున్నారు…ఆఖరికి జనసేన విజయ ఢంకా మోగిస్తుందని చెబుతున్నారు గానీ, అది ఏ స్థాయిలో విజయం సాధిస్తారు? అసలు అధికారం దక్కించుకునే రేంజ్‌లో జనసేన గెలుస్తుందా? అనేది క్లారిటీ రావడం లేదు.

ప్రభుత్వం మారుతుందని అంటున్నారు…కానీ జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పడం లేదు. అంటే పవన్ టి‌డి‌పితో కలిసి అధికారంలోకి రాబోతున్నారా? అని అందరికీ డౌట్ వస్తుంది. చంద్రబాబుని ఎలాగో ఒక్క మాట అనడం లేదు. అంటే ఆయనతో కలిసి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి కల్యాణ్ బాబు….బాబుతో కలిసి ఎలాంటి రాజకీయం చేస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version