కొడాలి నాని కి గుండెపోటు రాలేదు… అనుచరుల ప్రకటన

-

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారనే వార్తలు అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా కొడాలి నాని టీం ఎక్స్ వేదికగా స్పందించింది.

‘కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు. మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండి’ అని ట్వీట్ చేశారు. గతంలో కూడా కొడాలి నాని ఆరోగ్యం పై అనేక రూమర్లు వచ్చాయి. గతంలో కొడాలి నాని కి క్యాన్సర్ వచ్చిందని కూడా ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ సమయంలో కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కొడాలి నాని గుండెపోటు అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news