గత కొంత కాలంగా యూపీలో బహ్రైచ్ జిల్లా వాసులను భయానికి గురిచేస్తున్న మనుషులను భుజించే తోడేళ్ళు సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు తోడెళ్లను అధికారులు అంతమొందించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆరో తోడేలును ఎట్టకేలకు గ్రామస్థులు మట్టుబెట్టారు. దీంతో తోడేళ్ళ బాధిత గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని తమాచిపుర్ గ్రామంలో ఆరో తోడేలను గ్రామస్తుల వెంటాడి చంపేశారు. అనంతరం సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
దీంతో ఆపరేషన్ బేడియా పూర్తయినట్లుగా అటవీ అధికారులు తెలిపారు.తోడేళ్ళ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందగా.. అందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. రాత్రి టైంలో ఎక్కువగా దాడులు చేసే తోడేళ్ళు ఎక్కువగా చిన్న పిల్లలనే టార్గెట్‌గా చేసుకున్నాయి. వీటిని పట్టుకోవడానికి యూపీ ప్రభుత్వం ఆపరేషన్ బేడియాను చేపట్టింది. కనిపిస్తే కాల్చేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీచేశారు.