పర్వదినాలలో దేవుడి పూజ, దానం, ధర్మం మరింత విశేష ఫలితాలను ఇస్తాయిని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయడం, పరమశివుడి క్షేత్రంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయడం వలన, లక్ష్మీనారాయణులను పూజించడం వలన, ఆ సాయంత్రం సదాశివుడిని ఆవునెయ్యితో అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి.
సూర్యుడు శ్రీమన్నారాయముడని, విష్ణుమూర్తిగానూ పూజలందుకుంటున్నాడు. ఆ రోజున నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున ప్రదోష వేళలో పరమశివుడిని ఆరాధించడం ద్వారా అనేక శుభాలు లభిస్తాయి.
- కేశవ