ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో అవార్డులను సంపాదిస్తుందని అందరం మురిసిపోతున్నాం. కానీ ఒకప్పుడు అంతకుమించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయనటంలో సందేహం లేదు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన కళాతపస్వి విశ్వనాథ్ గురువారం రాత్రి అనారోగ్య సమస్యలతో వయోభారంతో మరణించారు. ఆయన మరణం మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. ఆయన ప్రతి సినిమాకు ఏదో ఒక అవార్డు లభించేది . రాష్ట్ర , జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈయన ముఖ్యంగా ఆయన సినిమాలే కాదు ఆయన సినిమాలో నటించిన వాళ్లు, ఆయన సినిమాలకు పని చేసిన వాళ్లు కూడా ఇలా అవార్డులను గెలుచుకున్నారు.
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళాతపస్వి కె విశ్వనాథ్ అంతర్జాతీయంగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ లిస్టు కి మన దేశం తరఫున పంపలేదు అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు క్రితమే మన తెలుగు సినిమా ఆస్కార్ క్వాలిఫై లిస్టు కి అధికారికంగా భారతదేశం నుంచి వెళ్ళింది. అది కూడా విశ్వనాథ గారి సినిమా కావడం గమనార్హం.
1985 లో కళాతపస్వి దర్శకత్వం వహించిన స్వాతిముత్యం సినిమా భారీ విజయం సంపాదించుకుంది. ఇందులో లోకనాయకుడైన కమలహాసన్ ఇందులో మైండ్ ఎదగని మనిషిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. స్వాతిముత్యం సినిమా భారతదేశం తరపున 59వ అకాడమీ అవార్డులకు బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరి లో భారతదేశ ప్రభుత్వం పంపించింది. ఇలా ఆస్కార్ కి అధికారికంగా వెళ్ళిన తొలి తెలుగు ఏకైక చిత్రం స్వాతిముత్యం. దీన్ని బట్టి చూస్తే డైరెక్టర్ కె విశ్వనాథ్ అప్పుడే ఆయన సినిమాలతో ఆస్కారు కలలు కనేలా చేశారని చెప్పవచ్చు.