ఓమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్…ఇది ప్రమాదకారి…!

-

యూరప్, ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ పై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల యూరప్ దేశాలు దక్షిణాఫ్రికా భయపడి పోతున్నాయి. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా సభ్యదేశాలకు అప్రమత్తత లేఖలను డబ్ల్యూహెచ్ఓ జారీచేసింది. ఈవేరియంట్ ప్రపంచదేశాలకు విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే విదేశీ విమానాలపై భారత్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వేరియంట్ పై అప్రమత్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news