నేడు తిరుపతిలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు.. హాజరుకానున్న ఎన్‌వీ రమణ

-

తిరుపతి : నేడు డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తిరుపతి గోవింద దామంలో మధ్యాహ్నం 1.30 గంటలకు డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే.. డాలర్‌ శేషాద్రి అంత్య క్రియలకు నివాళులర్పించనున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. నేడు ప్రజల సందర్శనార్థం సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో డాలర్‌ శేషాద్రి పార్థివదేహం ఉంచనున్నారు ఆయన కుటుంబ సభ్యులు.

సందర్శన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత… డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా… శ్రీవారి ఆలయ ఓ ఎస్ డి డాలర్ శేషాద్రి నిన్న మరణించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో కార్తీక్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన… నిన్న వేకువజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైరయిన డాలర్ శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్డీగా టిటిడి కొనసాగించింది. ఇక ఇవాళ టీ టీ డీ పాలక మండలి ఆధ్వర్యం లో…  డాలర్ శేషాద్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news