బిగ్ బాస్: ఈ సారి అతిధిగా ఆ ఇద్దరిలో ఎవరో..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఫైనల్ కి దగ్గరవుతున్న తరుణంలో అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారనే విషయం గురించి ఎవరికి వారు తమకి నచ్చిన వారికి మద్దతు తెలుపుతూ, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆరియానాకి మద్దతు తెలిపి ఓట్ వేయమని చెబుతూ బిగ్ బాస్ విన్నర్ కావడానికి అన్ని అర్హతలు ఆమెకి ఉన్నాయని ట్వీట్ చేసాడు.

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చే అతిధి ఎవరనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ మూడవ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చారు. ఆ ఫైనల్ ఎపిసోడ్ కి రేటింగ్స్ చాలా బాగా వచ్చాయి. బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా రేటింగ్స్ వచ్చాయి. ఐతే ఈ సారి కూడా చిరంజీవి వస్తారా లేదా మరెవరైనా వస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కానీ, మెగాస్టార్ కానీ అతిధిగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అతిధిగా ఎవరు వస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version