Bigg Boss Telugu 8 : ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు..? బిగ్ బాస్ ముద్దుబిడ్డను కాపాడేందుకు అతను బలి..?

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగులో నాలుగో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే అయ్యాయి. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. డేంజర్ జోన్ లో ఉన్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకులను కాపాడడానికి ఆ కంటెంట్ ని బలి చేసింది. అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సోమవారం నాలుగో వారం నామినేషన్స్ ని జరిపారు. ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు వాళ్లలో నాగమణికంఠ, ఆదిత్య ఓం, నబీల్, పృధ్విరాజ్, సోనియా, ప్రేరణ ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఓటింగ్ తో నబీల్ దూసుకువెళ్లిపోతున్నాడు. దాదాపు 35% ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు.

ఆ తర్వాత నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, పృధ్వీరాజ్, సోనియా ఉన్నారు. వీరిలో పృధ్వీరాజ్, సోనియా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఓటింగ్ ఇలాగే కొనసాగితే వీకెండ్ నాటికి వీళ్ళు డేంజర్ లో ఉండాల్సి వస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం ఎలిమినేషన్ పృథ్వి, సోనియా మధ్య ఉంటుంది. అలా జరగాలంటే విష్ణుప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ చేతిలో ఉంటుంది నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సోనియా, పృథ్వి కి అతను ఫాన్స్ ఓట్లు వేస్తే మాత్రం చివరి స్థానంలో ఉండలేరు.

విష్ణు ప్రియ ఫ్యాన్స్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారని కీలకంగా మారిపోయింది. విష్ణు ప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికీ ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్ళు టాప్ లో నిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ మాత్రం సోనియాకి లేకపోతే ఆమె డేంజర్ జోన్ లో ఉంటుంది. ఈమె హౌస్ లో చాలా తప్పులు చేసింది. కానీ అవేం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు లైవ్ వరకే పరిమితం చేసారు. సోనియా పై చాలా వరకు రావాల్సిన నెగిటివిటీని తగ్గించారు. సోనియాను సేవ్ చేయడానికి ఆదిత్య ఓం ని బిగ్ బాస్ బలి చేసే అవకాశం కనబడుతోంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతని పర్ఫామెన్స్ కాస్త తక్కువగా ఉంది కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version