విమానాలకు ఎందుకు తెలుపు రంగే వేస్తారు.. వేరే కలర్స్ వాడితే ఏం అవుతుంది..?

-

విమానం అనగానే మనకు మైండ్లో వైట్ కలర్ లో ఉండే ఫ్లైట్స్ హే గుర్తుకువస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమానాలు ఉన్నాయి. కానీ ఏ విమానం కూడా నలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి కలర్స్ లో ఎందుకు లేదు. అన్నీ వైట్ కలర్ లోనే ఎందుకు ఉంటాయి. అసలు మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..? మాకైతే వచ్చింది. అందుకే ఆన్సర్ తెచ్చేశాం..!
విమానానికి తెలుపు రంగు వేయడానికి ప్రధాన కారణం సూర్య కిరణాలు. దాని తెలుపు రంగు కారణంగా సూర్యుని కిరణాలు పరావర్తనం చెందుతాయి. తద్వారా విమానం బాడీ ఉష్ణోగ్రత పెరగదట.. తెలుపు రంగుకు బదులుగా ఇంకా ఏ రంగును వాడినా.. విమానం సూర్య కిరణాలను పరావర్తనం చేయకుండా శోశిస్తుంది. దాంతో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది.
ఇంకో కారణం ఏంటంటే.. విమానానికి తెలుపు రంగు వేయడం వలన సోలార్ రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ కారణంగా విమానం వేడెక్కదు. అంతేకాదు.. విమానాలు గంటలతరబడి ఆకాశంలో ప్రయాణించడమే కాకుండా.. రవ్‌వే పైనా ఎండలోనే ఉంటాయి. తద్వారా ఎండ వేడిమి విమానాలపై పడుతుంది. ఆ ప్రభావం విమానాలపై పడకుండా ఉండేందుకే వాటికి తెలుపు రంగు వేస్తారు.
విమానాలు సాధారణంగానే చాలా ఎత్తులో ఎగురుతాయి. ఈ నేపథ్యంలో వాటి రంగు తెల్లగా లేకపోతే.. కాలక్రమేణా వాటి రంగు తేలిపోతుంది. వాటి నిర్వహణ భారం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. ఫలితంగా విమానయాన సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సిందే.. మాటి మాటికి కలర్స్ వేయాలంటే.. చాలా ఖర్చుతో కూడుకున్న పని కదగా.. ఆ నష్టాలను భరించడానికి టిక్కెట్ల ధరలను భారీగా పెంచాల్సి వస్తుంది. ఈ కారణంగా కూడా విమానాలకు తెలుపు రంగు వేస్తారుట.
విమానం రంగు తెల్లగా ఉన్నప్పుడు దానికి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కనిపెట్టవచ్చు. దీనిని నిర్వహించడం కూడా చాలా సులభమని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదికలో ప్రచురించారు. విమానాలకు తెలుపు రంగు వేయడం వలన పక్షులు కూడా వాటిని గుర్తించి ఢీకొట్టకుండా ఉంటాయి. తెలుపు రంగు కాకుండా వేరే రంగులు వేస్తే.. పక్షులు వాటిని గుర్తించడంలో విఫలమవుతాయట.
మొత్తానికి ఇన్ని కారణాలు ఉన్నయనమాట.. ఫ్లైట్ వైట్ కలర్ లో ఉండటానికి..
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version