హోలీ నాడు ఇంట్లో అందరూ కలిసి ఎంతో ఆనందంగా రంగులతో హోలీ పండుగను జరుపుకుంటారు. అలానే హోలీ అంటే రుచికరమైన ఆహారం ఉంటుంది. తప్పనిసరిగా హోలీ నాడు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అన్ని వయసుల వాళ్ళు హోలీ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.
హోలీ నాడు తండై ని తీసుకుంటూ ఉంటారు. ఈ తండై లో బాదం యాలుకలు మిరియాలు గసగసాలు సోంపు గులాబీ వంటివి వేస్తారు. అయితే శివరాత్రి నాడు కూడా ఈ డ్రింక్ ని శివుడికి అందించి ఆ తర్వాత మాత్రమే అందరూ తీసుకుంటూ ఉంటారు. బాంగ్ తో కానీ లేదంటే వట్టిగా కానీ తండై తీసుకోవచ్చు.
అసలు ఎందుకు తండై ని హోలీ నాడు తీసుకుంటారు..? దాని వెనక కారణం ఏమిటి…? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం చూద్దాం… హోలీ నాడు వాతావరణం లో మార్పులు వస్తాయి దీంతో శరీరంలో కూడా మార్పులు వస్తాయి. అటువంటి సమయంలో తండై తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది పెంపొందిస్తుంది.
సోంపు:
ఇందులో ఉపయోగించే సోంపు వలన కాలుష్యం జింక్ విటమిన్ సి ఐరన్ వంటివి అందుతాయి. అజీర్తి సమస్యల్ని కూడా ఇది దూరం చేస్తుంది.
బాదం, గసగసాలు:
బాదం గసగసాలు లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అలానే విటమిన్స్ కూడా ఉంటాయి. గసగసాలలో కాల్షియం ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
యాలుకలు, నల్ల మిరియాలు:
యాలకులు నల్ల మిరియాలు ని తండై లో వేస్తారు మంచి రుచికరమైన ఫ్లేవర్ ని ఇది ఇస్తుంది.
గులాబీ రేకులు:
గులాబీ రేకుల్ని కూడా తండై లో వేస్తారు. ఫైటో కెమికల్స్ ఇందులో ఉంటాయి అలానే విటమిన్ సి కూడా అందుతుంది.