మోడీ ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తే కెసిఆర్ కి కడుపుమంట ఎందుకు – ఎంపీ లక్ష్మణ్

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించనున్న విషయం తెలిసిందే. 11వ తేదీ సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన 12వ తేదీ న పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టి ఏపీలో ప్రోగ్రామ్స్ ముగిసిన తరువాత ఈ నెల 12వ తేదీన విశాఖ నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ఉన్న ఎరువుల కర్మగారాన్ని జాతికి అంకితం చేయడానికి రానున్నారు. అయితే ప్రధాని పర్యటనపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీీ భగ్గుమంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా బిజెపి ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటన అడ్డుకుంటామని అంటున్నారని మండిపడ్డారు. మోడీ ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తే కేసీఆర్ కి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version