పీఎం కేర్స్ ఫండ్ వివ‌రాలు చెప్ప‌మంటే మోదీకి ఎందుకంత భ‌యం ?

-

ప్ర‌ధాని మోదీ.. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అంద‌జేసిన వారి వివ‌రాల‌ను ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు. విరాళాల‌ను అందజేసిన వారి వివ‌రాల‌ను బ‌య‌టకు చెబితే త‌ప్పేమిట‌ని అన్నారు. వివ‌రాలు చెప్పాలంటే బ‌హుశా మోదీకి భ‌యంగా ఉందేమో.. అని రాహుల్ అన్నారు. ఈ మేర‌కు రాహుల్ ట్వీట్ చేశారు.

చైనాకు చెందిన హువావే, షియోమీ, టిక్‌టాక్‌, వ‌న్‌ప్ల‌స్ వంటి కంపెనీలు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అంద‌జేశాయ‌ని, అందుక‌నే మోదీ ఆ ఫండ్‌కు వ‌చ్చిన విరాళాల వివ‌రాల‌ను తెల‌ప‌డం లేద‌ని రాహుల్ ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్‌పై స‌మీక్ష చేప‌ట్టాల‌న్న పార్ల‌మెంట్ ప్యానెల్ నిర్ణ‌యాన్నిబీజేపీ ఎంపీలు అడ్డుకున్నార‌ని ఆరోపిస్తూ రాహుల్ ఓ నివేదిక‌ను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.

పీఎం కేర్స్ ఫండ్‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా పెద్ద ఎత్తున విరాళాలు వ‌చ్చాయ‌ని, క‌నుక ఆ ఫండ్‌పై పూర్తిగా ఆడిటింగ్ జ‌ర‌గాల‌ని రాహుల్ అన్నారు. ఇదే విష‌యాన్ని రాహుల్ సోనియా గాంధీతో నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల స‌మావేశంలోనూ లేవ‌నెత్తారు. ఆ ఫండ్‌పై పూర్తిగా స‌మీక్ష జ‌రిపి దానికి ఎవ‌రెవ‌రు, ఎంతెంత విరాళాల‌ను అంద‌జేశారో ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్రభుత్వం తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version