ఐఫోన్ అంటే ఓ రేంజ్. అది వాడేవారిని చూస్తే ఆండ్రాయిడ్ యూజర్స్ ఆటోమెటిక్‌గా జలస్ ఫీల్ అవుతారు..ఐఫోన్ కొంటే సరిపోదు…అది మెయింటేన్ చేయడం కూడా పెద్ద టాస్కే..! ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే ఛార్జర్ కూడా ఇస్తారు. మనం ఇంకా ఇయర్ ఫోన్స్ కొంటే చాలు.. ఇంతకుముందు ఇవి కూడా ఇచ్చే వాళ్లనుకోండి. కానీ ఐఫోన్ కొంటే ఫోన్ తప్ప ఏం రావు. మళ్లీ ఛార్జర్ కొనాలి, హెడ్ సెట్ కొనాలి. ఈ రెండు కొనే డబ్బుతో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవచ్చు..! అయితే తాజాగా ఐఫోన్ సంస్థకు బ్రెజిల్ కోర్ట్ షాకిచ్చింది. 20 మిలియన్ డాలర్ల్ ఫైన్ కూడా వేసింది!
ఛార్జర్లు లేకుండా లేటెస్ట్ ఐఫోన్ 14, 14 ప్రో ఫోన్లను అమ్మినందుకు యాపిల్ సంస్థకు బ్రెజిల్ కోర్టు 20 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. అంటే మన కరెన్సీలో అక్షరాల దాదాపు 165 కోట్ల రూపాయల జరిమానా అన్నమాట.. ఛార్జర్ లేకుండా ఐ ఫోన్ అమ్మి బలవంతంగా కస్టమర్లపై అదనపు భారం వేయడం దుర్వినియోగ విధానమంటూ బ్రెజిల్ కోర్టు తీవ్రంగా మండిపడింది. బ్రెజిల్ వినియోగదారుల ఫోరమ్ దాఖలు చేసిన దావాపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐఫోన్ విక్రయాలను కూడా నిషేధిస్తున్నట్టు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది.
చట్టాన్ని ఉల్లఘించింది..
సావో పాలో రాష్ట్ర కోర్టు గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఛార్జర్‌లు లేకుండా ఐఫోన్‌లను విక్రయించడం ద్వారా ఆపిల్ వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘించిందని.. ఇలాంటి ఘటన బ్రెజిల్‌లో జరగడం ఇది మూడోసారని పేర్కొంది. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కంపెనీకి ఆదేశించింది.
ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగానే తాము కొత్త ఐ-ఫోన్‌లతో ఛార్జర్‌లను నిలిపివేసినట్టు యాపిల్ పేర్కొంది. బ్రెజిల్ కోర్టు తీర్పుపై కోర్టులో అప్పీల్‌కు వెళ్ళనున్నట్లు యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ వేస్ట్ తగ్గించాలని ఫోన్‌కు ఛార్జర్ ఇవ్వకపోతే..మరి ఎలా ఛార్జింగ్ పెడతారు. తిరిగి అదే కంపెనీ మళ్లీ ఛార్జింగ్‌ను ఎందుకు సపరేట్‌గా అమ్ముతోంది..ఈ లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రోకాన్-ఎస్‌పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపెజ్ మాట్లాడుతూ.. బ్రెజిల్‌లో పటిష్టమైన వినియోగదారుల రక్షణ చట్టాలు, సంస్థలు ఉన్నాయని యాపిల్ అర్థం చేసుకోవాలని తెలిపారు.. ఈ చట్టాలను, వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
2024 చివరి నుంచి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలలో USB-C పోర్ట్‌లను సింగిల్ ఛార్జర్ ప్రమాణంగా ఉపయోగించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇందుకు అనుగుణంగా Apple కూడా తన ఫోన్ డిజైన్‌లను మార్చడానికి సన్నాహాలు చేస్తోంది.