అహమ్మదాబాద్ లోని మోతేరా స్టేడియం పేరు మారుస్తూ నరేంద్ర మోడీ స్టేడియంగా పెట్టడంతో ప్రతిపక్షాలు గోల గోల చేస్తున్నాయి. రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేసే వరకూ ఎవరికి చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏంటని, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ప్రతిపక్షాలతో సహా చాలా మందికి అనుమానంగా ఉంది. సర్దార్ వల్లభాభాయ్ పటేల్ పేరును తీసివేస్తూ నరేంద్ర మోడీ పేరు పెట్టడం సరికాదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అదంత సబబుగా లేదని అంటున్నారు.
స్టేడియంకి మాత్రమే నరేంద్ర మోడీ పేరు పెట్టమని, అందులో ఉన్న విభాగాలకి సర్దార్ వల్లభా భాయ్ పటేల్ పేరే ఉందని చెప్తూ వస్తున్నప్పటికీ, ప్రపంచంలో పెద్దదైన మోతేరా స్టేడియం పేరును సడెన్ గా మార్చడం సరికాదని అంటున్నారు. మరి ఈ విషయమై జరుగుతున్న చర్చలు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి.