ఉప్పుని చేతికి ఎందుకు ఇవ్వకూడదు..? కారణం ఏమిటో తెలుసా..?

-

కొన్ని కొన్ని వస్తువులను చేతికి ఇవ్వకూడదని కిందనే పెట్టమని చెప్తూ ఉంటారు. ఉప్పు, కారం వంటి వాటిని చేతికి ఇవ్వకూడదని ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే ఎందుకు ఉప్పు ని కింద పెట్టాలి..? చేతికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం… చాలా సార్లు ఉప్పుని చేతికి ఇవ్వకూడదు కింద పెట్టమని చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అందుకు కారణం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం దశదానాలు లో ఉప్పు కూడా ఒకటి.

పితృ దానాల్లో శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు ఈ కారణంగానే పూజ సమయంలో ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయి అని నమ్ముతారు. ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం వస్తుందట. ఉప్పుని కనుక చేతికి ఇస్తే గొడవలు జరుగుతాయని ఉప్పుచేతిలోకి అందుకుంటే శని ప్రభావం ఎక్కువ ఉంటుందని అంటారు.

పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమధనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారయిందని పండితులు అంటారు. ఉప్పుని లక్ష్మీస్వరూపంగా అందుకే భావిస్తారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలని చేయమని పండితులు చెప్పడం జరుగుతుంది. జేష్ఠదేవిని వదిలించుకోవాలంటే ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పుని కనుక ఒకరి చేతి నుండి అందుకుంటే చెడు సక్రమిస్తుందని అంటారు ఈ కారణంగానే ఉప్పు ని చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news