త్వరలో ఏపీలో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం జరుగనుంది. రూ.16 వేలకోట్ల ఖర్చుతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను ఆయన పరిశీలించారు.
రూ. 300 కోట్లతో చేపట్టిన హార్బర్ పనులను ఇప్పటికే 95% పూర్తయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా జువ్వల దిన్నె హార్బర్ ప్రారంభోత్సవం అవుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ గుంటూరు పర్యటన ఖరారైంది. జూన్ 2న గుంటూరులో పర్యటించనున్న సీఎం… వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొన్నారు. ఈ మేళాలో భాగంగా 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ వేదిక ద్వారా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు.