శనివారం హనుమాన్‌ పూజ ఎందుకు చేస్తారు ?

-

శనివారం.. మందవారం.. స్థిరవారం ఇలా పిలిచే ఈరోజు అంటే సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి, విష్ణువు, శ్రీరాముడికి చాలా ప్రతీతి అంతేకాదు కలియుగంలో శ్రీఘ్రంగా సాక్షాత్కరించే ఆంజనేయస్వామికి కూడా ప్రీతికరం. ఆ విశేషాలు తెలుసుకుందాం…

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.


“సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”
అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి.

శనివార వ్రతం ఎలా ?

ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి. ఇక ఆలస్యమెందుకు భయాలు, రోగాలు, ఈతి బాధలు, నవగ్రహదోషాలు, విజయం కోసం శనివార వ్రతం చేయండి, శుభ ఫలితాలను పొందండి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news