మారేడు దళాలతో శివుడిని ఎందుకు పూజించాలి…?

-

మహా శివుడిని మారేడు దళాల తో పూజిస్తారు అన్న సంగతి తెలిసిందే. అయితే శివుడికి మారేడు దళాలు ఎందుకు ఇష్టం..?, ఎందుకు మారేడు దళాలతో శివుడిని పూజించడం..? అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. శివుడికి మారేడు దళాలు అంటే ఇష్టం. మారేడు ఫలాలని శ్రీ ఫలం అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మి. శ్రీ ఫలం అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. శ్రీ ఫలాల తో లక్ష్మీ దేవిని పూజిస్తే మన ఇంట సిరి సంపదలు ఉంటాయని పండితులు అంటున్నారు.

మారేడును బిల్వ అని కూడా అంటారు. ఇది మహా మంగళకరమైన వృక్షం. ఈ ఆకులు మూడు కలిపి ఉంటాయి. అందుకే ఈ ఆకులని త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధన లో తప్పకుండా వీటిని ఉపయోగిస్తారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాల తో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని అంటారు.

పైగా మహా శివరాత్రి నాడు శివుడిని మారేడు దళాల తో పూజిస్తే శివుడు త్వరగా కటాక్షిస్తాడు అని పండితులు చెబుతున్నారు. అలానే మారేడు దళాల తో పూజిస్తే సర్వ శుభాలను ఇచ్చి మోక్షాన్ని మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. పైగా ఇందులో శాస్త్రీయత కూడా ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడం లో మారేడు ముందుంటుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం చాలా మంచిది. పైగా ఇది అనారోగాల బారిన పడకుండా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version