మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాలో ఓ హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త చెవులు కోసేసింది భార్య. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డిగూడెం తండా స్థానికుడైన వ్యక్తి భార్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయితే భర్త అడ్డుగా మారుతున్నాడని భావించి, భార్య తన ప్రియుడితో కలిసి అతన్ని చంపేయాలని ప్లాన్ వేసింది.

హత్యాయత్నంలో భాగంగా భర్తపై దాడి చేసి చెవులు కోసేశారు అతని భార్య ప్రియుడు. దీంతో తీవ్రమైన రక్తస్రావం, నొప్పితో భర్త కేకలు వేస్తూ బయటకు పరుగెత్తాడు. ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తమై ప్రియుడిని పట్టుకొని చితకబాదారు. గాయపడిన భర్తను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
https://twitter.com/bigtvtelugu/status/1967787962483281943