తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనాలకు 12 నుంచి 15 గంటలు పడుతున్నట్లు టీటీడీ పాలక మండలి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 31 కంపార్ట్ మెంట్లలలో భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. ఇక నిన్న ఒక్క రోజే..65,066 భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

24,620 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్లు టీటీడీ పాలక మండలి వెల్లడించారు.