భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కిందకు రాదని మధ్య ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.శారీరక సంబంధం పెట్టుకోకుండా మరో వ్యక్తిని భార్య ప్రేమిస్తే అది అక్రమ సంబంధం కిందకు రాదని వెల్లడించింది.
పరాయి పురుషుడితో ఆమె లైంగికంగా కలిస్తేనే అక్రమ సంబంధం అవుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పులో వెల్లడించింది.తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించినందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టు పై విధంగా స్పందించింది. భార్యకు నెలకు రూ.4వేల మధ్యంతర భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.