సాధారంణగా విషపూరిత వన్యప్రాణులు కనిపిస్తే చాలు కొందరు భయపడిపోతుంటారు. మరికొందరు ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చేందుకు ధైర్యం చేయరు. కానీ, ఓ యువతి వన్యప్రాణి సంరక్షకురాలు.అందులోనూ ఆమెకు పాములు అంటే చాలా ఇష్టం. వాటికి ఏమైనా జరిగినా, వాటి వలన తోటి జనాలకు ఏమైనా జరుగుతుందంటే వెంటనే రంగంలోకి దిగుతుంది.
ఈ క్రమంలోనే ఓ విషపూరిత పాము తల వలలో చిక్కుకుంది. దాని విడిపించుకోవడానికి ఆ పాము విలవిలలాడిపోయింది. అది గమనించిన కర్ణాటకకు చెందిన నిర్జరా చిట్టీ అనే యువతి ధైర్యం చేసి ముందడుగు వేసింది. వెంటనే ఆ పామును చేతిలో పట్టుకుని ఆ వల నుంచి విడిపించి వదిలేసింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అమ్మో.. ఇదేం ధైర్యం తల్లీ!
పాము విష ప్రాణి అని తెలిసినా దాన్ని కాపాడేందుకు ధైర్యంగా ముందుకెళ్లిందో యువతి. వీడియోలో ఉన్న ఆమె పేరు నిర్జరా చిట్టీ. కర్ణాటకకు చెందిన ఆమె పాముల రక్షకురాలు. పాములు జనావాసంలో లేదా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్లి వాటిని రక్షిస్తుంటారు. తల వలలో… pic.twitter.com/FslGo4YMzC
— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025