కరోనా వైరస్: వ్యాక్సిన్ కి ముందు ఈ నాలుగు డిజిట్ కోడ్ తప్పనిసరి…!

-

వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఒకసారి వాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఫోర్ డిజిట్ కోడ్ ని షేర్ చేయాలి. డేటా ఎంట్రీ తప్పులు రాకుండా ఉండడానికి ఈ కోడ్ పద్దతిని ప్రభుత్వం యాడ్ చేయడం జరిగింది. చాలా మంది కంప్లైంట్స్ కూడా చేశారు. అయితే ఆలా తప్పులు ఏమి జరగకుండా ఉండడానికి దీనిని తీసుకు రావడం జరిగింది.

కోడ్ సిస్టం ని కొత్తగా తీసుకురాగా… మే 8 నుండి అంటే నేటి నుండి అమల్లోకి రానుంది అని హెల్త్ మినిస్టరీ చెప్పడం జరిగింది. దీనితో కోవిన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సిస్టం లో కొత్త ఫీచర్ ఉంది వెరిఫికేషన్ తర్వాత కూడా వేక్సిన్ వేయించుకునే ముందు ఫోర్ డిజిట్ కోడ్ ని అడుగుతారు.

అయితే ఈ ఇది కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఆ ఫోర్ డిజిట్ కోడ్ ని అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ని ప్రింట్ చేసి లేదా డిజిటక్ కాపీ తీసుకెళ్లాలి. అదే విధంగా కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ కూడా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకి వెళుతుంది.

ఈ ఫోర్ డిజిట్ కోడ్ కారణంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వాళ్ళు డిజిటల్ లేదా ఫిజికల్ కాపీ ఒకటి పట్టుకుని వెళ్లాలి మరియు రిజిస్టర్ రిజిస్టర్ ఫోన్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ కూడా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version