కరోనా దెబ్బకు దేశమే అతలాకుతలం అవుతోంది. ఆక్సిజన్ అందక ఎంతమంతి చనిపోతున్నారో చూస్తున్నాం. కానీ మనలాగా చూస్తూ ఊరుకోలేదు ఆ ఇద్దరు దంపతులు. ప్రజలకోసం ఏదైనా చేయాలనుకున్నారు. మరి వారేమైనా కోటీశ్వరులా అంటే అదీ కాదు. కానీ ఏదో చేయాలనే తపన. అంతే భార్య నగలు అమ్మి మరీ రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. వారే ముంబయిలోని పాస్కల్ సల్దానా దంపతులు.
ఫంక్షన్లు, పెళ్లిల్లకు డెకరేషన్ పనులు చేసే పాస్కల్.. ఏప్రిల్ 18నుంచి కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఈ ఆలోచన ముందు తన భార్యకే వచ్చిందని ఆయన చెప్పారు. ప్రజలు చనిపోతున్నారని ఏదైనా చేద్దామని ఆమె చెప్పడంతో.. చివరికి ఆమె నగలను అమ్మి ఈ విధంగా రోగులకు సాయం చేస్తున్నామని పాస్కల్ తెలిపాడు. అయితే తన భార్యకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఆమె ఐదేళ్లుగా డయాలసిసి్ ట్రీట్ మెంట్ తీసుకుంటుదని తెలిపాడు.
తన భార్య కోరిక మేరకే నగలు అమ్మి రూ.80వేలతో సేవ చేయడం మొదలు పెట్టానని పాస్కల్ ఆవేదన తెలిపాడు. తన భార్య ఆక్సిజన్ తో బతుకుతోందని, తన భార్య పేరుమీదే ఈ సేవలు చేస్తున్నానని తెలిపాడు. ఇప్పటి వరకు 66మందికి సాయం చేశామని, ఇంకా చేస్తామని తెలుపుతున్నాడు. కోట్లు ఉన్న వాళ్లు కూడా నాకేంటి అనుకుంటున్న రోజుల్లో వీరి సేవలు అద్భుతం కదా.