బెంగళూరులో ఓ దారుణం చోటుచేసుకుంది.హుళిమావు సమీపంలో భార్యను చంపి, ముక్కలుగా నరికి ఆపై సూట్‌కేసులో మృతదేహాన్ని భర్త రాకేశ్ తీసుకెళ్లాడు? అనంతరం వారి తల్లిదండ్రులను పిలిచి నేరం అంగీకరించాడు.మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్.వీరిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
అయితే, ఈ కేసుకు సంబంధించి డీసీపీ సారా ఫాతిమా కీలక విషయాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)రెండేళ్ల క్రితం రాకేశ్‌కి వివాహం జరిగింది.ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు.భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడని డీసీపీ తెలిపింది.