ధర్మశాల వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది.ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 218 పరుగులు చేయగా ఇండియా 477 పరుగులతో దీటుగా బదులిచ్చింది. 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 రన్స్ కే కుప్పకూలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో భారత్ 4-1 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తన రిటైర్మెంట్ వార్తలను ఖండించిన ఆయన.. తాను ఇక ఆడలేనని భావిస్తే వెంటనే క్రికెట్కు దూరంగా ఉంటానని రోహిత్ శర్మ స్పష్టం చేశారు.గత రెండు మూడు సంవత్సరాలలో తన ఆట తీరు మరింత మెరుగైనట్లు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇక చివరి టెస్టులో ఆధిపత్యం కనబరిచిన ఇండియా కేవలం మూడు రోజుల్లోనే ఆటను ముగించేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.