దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజూ 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం కిందట రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నారు కనుక కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది చివరి వరకు కరోనా అంతం అవుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం చెప్పవచ్చు.
దేశంలో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో టీకాల కొరత కారణంగా 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వడం లేదు. కేవలం గతంలో మొదటి డోసు తీసుకున్న వారికే ఇప్పుడు రెండో డోసును ఇస్తున్నారు. అయితే టీకాల ఉత్పత్తిని పెంచేందుకు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి వరకు 200 కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్రం తెలిపింది. అయితే అప్పటి వరకు భారీ ఎత్తున టీకాలు అందుబాటులోకి వస్తాయి కనుక అప్పటి వరకు కరోనా అంతం అవుతుందని భావిస్తున్నారు.
దేశంలో కోవిడ్ మూడో వేవ్ అక్టోబర్-డిసెంబర్ మధ్య వచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే డిసెంబర్ వరకు భారీ ఎత్తున ఎలాగూ టీకాలు వస్తాయి కనుక కోవిడ్ మూడో వేవ్‌లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ టీకాల పంపిణీని పెద్ద ఎత్తున చేపడుతారు కనుక మూడో వేవ్‌తోనే కరోనా అంతం అవుతుందని భావిస్తున్నారు. అయితే మూడో వేవ్ ముగిసేలోగా టీకాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకు ఇవ్వాలి. అప్పుడే కోవిడ్ అంతమవుతుంది. లేదంటే మరిన్ని వేవ్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి కేంద్రం చెప్పినట్లుగా డిసెంబర్ వరకు 200 కోట్ల మేర డోసులు అందుబాటులో ఉంటాయా, లేదా, అన్నది చూడాలి.