ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఫేస్ బుక్ కాపాడుతుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. కరోనా సంక్షోభంతో దేశం ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఫేస్ బుక్ మోడీకి వ్యతిరేకంగా వస్తున్న కొన్ని పోస్ట్ లను కనపడకుండా దాస్తుంది.
ఫేస్బుక్ బుధవారం “#ResignModi” అనే హ్యాష్ ట్యాగ్ లేదా టెక్స్ట్ ఉన్న పోస్ట్లను పూర్తిగా ఇండియాలో ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కి కనపడకుండా దాచింది. అయితే “ఆ పోస్ట్‌లలోని కొంత కంటెంట్ మా కమ్యూనిటీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటుంది అని ఫేస్ బుక్ వెల్లడించింది. వాటిని ఇండియాలో ఉన్న వాళ్ళు చూడలేరు అని యుఎస్, కెనడా లేదా యుకెలో ఉన్నవారు వాటిని నార్మల్ సెర్చ్ తో చూడవచ్చు అని తెలిపింది. మూడు గంటల తర్వాత వాటిని కనపడేలా మార్చింది.