బెంగళూరు ఫ్లైట్ లో మిస్సయిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్…ఐపీఎల్ టీమ్ దగ్గర ?

-

బెంగళూరు ఇండిగో విమానంలో న్యూ ఢిల్లీ పంపిన ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఆశ్చర్యకరంగా మిస్సయింది. దీనిని కోవిడ్ సోకిన ఒక సీనియర్ సిటిజన్ కోసం సోమవారం నాడు బెంగళూరు నుంచి ఢిల్లీ పంపారు.అయితే అది మిస్సయిందని వెతకగా రెండు రోజుల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ బృందం వద్ద దొరికిందని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ టీమ్ మాత్రం విస్టారా విమానంలో అక్కడకు వచ్చింది.

అనూహ్యంగా వాళ్ళ వద్దకు దానిని పంపడంతో చివరికి పరికరాలు నిన్న ఉదయం అసలు గ్రహీతకు చేరుకున్నాయి. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సిఎస్‌కె తలపడింది. తన 68 ఏళ్ల తండ్రి ఎ అన్సారీ ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో అన్వర్ బెంగళూరు నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను కొనుగోలు చేసి, ఏప్రిల్ 26న ప్రయాణించిన ఫ్లైట్ 6 ఇ 5161 లో చెక్-ఇన్ సామానుగా పంపించాడని, చెబుతున్నారు. అతని పరిస్థితి క్షీణించినట్లయితే ఢిల్లీలో పడకలు దొరకడం లేదని అక్కడికి పంపారని అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version