వైజాగ్ గ్యాస్ లీకైన ఘటన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాటల యుద్ధం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన ట్వీట్లు నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులను ఉద్దేశించి లోకేష్ పలు వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఏపీలో అటు వైకాపా, ఇటు టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.
వైజాగ్ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానిపై లోకేష్ స్పందిస్తూ.. ”ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన రూ.1 కోటిని ముఖ్యమంత్రి, మంత్రులకు ఇస్తాం, వారు చావడానికి సిద్ధమా.. అని విశాఖ వాసులు, గ్యాస్ లీకేజ్ బాధితులు ప్రశ్నిస్తున్నారని..” అన్నారు. ”విషవాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దు అని ప్రజలు ఆందోళన చేస్తుంటే.. వారిని అరెస్టు చేస్తారా..” అని లోకేష్ ప్రశ్నించారు.
అదే కోటి మీకిస్తాం చావడానికి సిద్దామా? అని ముఖ్యమంత్రి @ysjagan గారిని, వైకాపా మంత్రులను విశాఖ వాసులు, ఎల్‌జీ గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులు ప్రశ్నిస్తున్నారు.విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దు అని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా?(1/3) pic.twitter.com/O0UVW1c4k7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 9, 2020
ప్రజల చావుకు కారణం అయిన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారు, అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారు. ప్రశ్నించిన ప్రజల్ని మాత్రం అణిచివేస్తున్నారు. పైగా మీ మంత్రులు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంటూ అధికార మదం తో మాట్లాడుతున్నారు.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 9, 2020
వారు వేసిన ఓట్లతోనే మీరు పెత్తనం చేస్తున్నారు అన్న విషయం మర్చిపోయి ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడటం దారుణం. తక్షణమే దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల డిమాండ్ కి అంగీకరించి కంపెనీ అక్కడి నుండి తరలించాలి.(3/3) #VizagDemandsJustice
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 9, 2020
”ప్రజల చావుకు కారణం అయిన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని, అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారని, ప్రశ్నించిన ప్రజల్ని మాత్రం అణిచివేస్తున్నారన్నారు. పైగా మీ మంత్రులు.. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటూ.. అధికార మదంతో మాట్లాడుతున్నారని లోకేష్ అన్నారు. వారు వేసిన ఓట్లతోనే మీరు పెత్తనం చేస్తున్నారు అన్న విషయం మర్చిపోయి ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడడం దారుణమని, తక్షణమే దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల డిమాండ్ కి అంగీకరించి కంపెనీని అక్కడి నుండి తరలించాలని..” లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.