పరిస్థితులు చాలా క్లిష్టం గా ఉన్నాయి… మామూలుగానే గత ప్రభుత్వ పుణ్యమాని అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం! దానికి తగ్గట్లుగానే కరోనా పేరుచెప్పి రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోతున్న వైణం! ఈ పరిస్థితుల్లో కూడా మెదడును పాదరసంలా కదిలిస్తూ… నిత్యం సంక్షేమ పథకాల అమలు, జనాలకు సమస్యలు లేకుండా చూడటం వంటి అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు! ఇదే క్రమంలో తాజాగా సెప్టెంబరు 1 నుంచి న్యాయమైన బియ్యాన్ని రేషన్ కార్డుదారుల ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు జగన్!
అవును… ఇంతకాలం గత ప్రభుత్వం కొన్న నాసిరకం బియ్యాన్ని ఇష్టం లేకపోయినా అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఇప్పటికే పౌరసరఫాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం కొంటున్న నాణ్యమైన బియ్య జనాలకు అందబోతోంది. ఇందులో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని సెప్టెంబరు 1 నుంచి రేషన్ కార్డుదారుల ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను, సంబందిత శాఖను ఆదేశించారు. సరిగ్గా అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రావాలని స్పష్టం చేశారు.
తాజాగా రేషన్ పంపిణీపై సమీక్షలు జరిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్… బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకత లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా 2.3 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందించనుంది! ఇందుకు గానూ ప్రభుత్వం సుమారు 13,370 వాహనాలను ఏర్పాటు చేయనుంది! ఈ వాహనాలు గ్రామ సచివాలయం పరిధిలో ఉంటాయి! ఆ వాహనాల్లోనే ఎలక్ట్రానిక్ తూకం యంత్రం కూడా ఉంటుంది. వీటి ద్వారా ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి.. వారి ముందే బస్తా సీలు తెరచి నిర్దేశించిన కోటా ప్రకారం పంపిణీ చేస్తారు! ఇందుకు గానూ… గోదాముల నుంచి వచ్చే ప్రతి బస్తాపైనా సలు, బార్ కోడ్ ఉంటుందని పౌరసరఫరాలశాఖ చెబుతుంది! ఏది ఏమైనా… పారదర్శకత, నాణ్యత విషయంలో జగన్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది!