2045 నాటికి మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 783 మిలియన్లకు చేరుకుంటుందా..?

-

మన దేశంలో దీర్ఘకాలికరోగాలతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది షుగర్‌, బీపీ రోగులు ఎక్కువయ్యారు.దేశంలో 60 మిలియన్ల గౌట్ రోగులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్‌లో భాగంగా ఆరోగ్యానికి సవాల్‌గా మారుతున్న మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి వ్యాధులపై నిర్వహించిన సెమినార్‌లో నిపుణులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వారు చెప్పిన లెక్కలు చూస్తుంటే.. భవిష్యత్తు మీద భయం మొదలవుతుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ చైర్ అరవింద్ చోప్రా మాట్లాడుతూ.. కండరాల నొప్పిపై జరిపిన జాతీయ సర్వేలో 0.32 శాతం మంది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని గుర్తించారు. ఇది భారతదేశంలో 60 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. గౌట్‌తో బాధపడుతున్న చాలా మంది అది తీవ్ర స్థాయికి చేరే వరకు వైద్య సహాయం తీసుకోవడం లేదని ఆయన తెలిపారు.

ఇతర చికిత్సలతో పాటు ఆయుర్వేద చికిత్సలు కూడా అందిస్తే కీళ్లనొప్పులు, మధుమేహం వంటి వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని సెషన్‌లో పాల్గొన్న నిపుణులు సూచించారు. ఆయుర్వేదంలో గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్-గ్రాడ్యుయేట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అనూప్ థాకర్ మరియు లాట్వియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొఫెసర్ వాల్డిస్ పిరాగ్స్ మధుమేహ చికిత్సలో యోగాతో ఆయుర్వేదాన్ని కలపడం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.

ప్రపంచ అధ్యయనంలో 2021లో 532 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, 2045 నాటికి ఈ సంఖ్య 783 మిలియన్లకు చేరుతుందని అనూప్ థాక్కర్ చెప్పారు. సర్వే ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులుగా గుర్తించిన 266 మిలియన్ల మందికి ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలియకపోవడం మరింత ఆందోళనకరం అని ఆయన తెలిపారు.

వాల్డిస్ పిరాగ్స్ మెదడులోని హైపోథాలమస్ యొక్క విధులు మధుమేహ వ్యాధిగ్రస్తులను ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి మాట్లాడారు. డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన సూచించారు. పాశ్చాత్య వైద్యం యొక్క ఆధునిక పద్ధతులతో ఆయుర్వేదం యొక్క ప్రాచీన జ్ఞానాన్ని సమగ్రపరచడం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేస్తుంది.

మధుమేహం అంటే ఏదో షుగర్‌ లెవల్స్‌ పెరిగే జబ్బే దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చాలా మంది అనుకుంటారు. మీరు ఆ షుగర్‌ను కంట్రోల్‌ చేయలేకపోతే.. మీ ప్రాణాలను తీయడానికి కూడా మధుమేహం వెనకాడదు. ఒంట్లో విష సర్పాన్ని పెంచుకున్నట్లే.. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే.. ఆ పాము అంట కంట్రోల్లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news