బైరెడ్డికి ‘సైకిల్’ సీటు ఫిక్స్ అవుతుందా?

-

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వీక్ అనే సంగతి తెలిసిందే..ఏదో ఒక్క అనంతపురం జిల్లాలోనే టీడీపీ స్ట్రాంగ్ తప్ప…మిగిలిన కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పార్టీ చాలా వీక్..ఈ జిల్లాల్లో పూర్తి ఆధిక్యం వైసీపీదే..2014 ఎన్నికలు కావొచ్చు..2019 ఎన్నికలు కావొచ్చు ఈ జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. అంటే సీమలో వైసీపీకి ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీమలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉండటం టీడీపీకి మైనస్ అయింది…వైసీపీకి ప్లస్ అయింది. అయితే ఆ మైనస్ ని పోగ్గొట్టుకోవడానికి టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది.

ఈ సారి రాయలసీమలో మంచి విజయాలని సాధించాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు…సీమలో బలం పెంచడం కోసం కష్టపడుతూనే ఉన్నారు..ఎప్పుడు ఏదొరకంగా సీమ జిల్లాల్లో పర్యటిస్తూ…ఆ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గాన్ని టీడీపీ వైపుకు తిప్పుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే పలువురు రెడ్డి నేతలని పార్టీలోకి తీసుకొచ్చారు..అయితే మరికొందరిని కూడా టీడీపీలోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి….టీడీపీలోకి వస్తున్నారంటూ ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది.  మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో క్లారిటీ లేదు. సిద్ధార్థ్ విషయం పక్కన పెడితే…సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టీడీపీలోకి రాబోతున్నారని ప్రచారం మొదలైంది..రాజశేఖర్ సోదరుడు కుమారుడే సిద్ధార్థ్ అనే విషయం అందరికీ తెలిసిందే..అయితే ఇప్పుడు ఇద్దరు రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నారు.

సిద్ధార్థ్ వైసీపీలో ఉండగా, రాజశేఖర్…బీజేపీలో ఉన్నారు…అయితే గతంలో రాజశేఖర్ టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే…తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట రాజకీయం నడిపారు…తర్వాత కాంగ్రెస్, మళ్ళీ 2019 ఎన్నికల ముందు టీడీపీకి దగ్గరయ్యారు..ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు..మళ్ళీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వస్తారని ప్రచారం మొదలైంది…అలాగే ఆయనకు శ్రీశైలం సీటు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం వస్తుంది. కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి…టీడీపీలోకి వస్తే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పాలి..మరి చూడాలి బైరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో

Read more RELATED
Recommended to you

Exit mobile version