మూడో స్థానంలో ఉన్న వాడికి సిఎం సీటు ఇస్తారా…? ఛీ…!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డియే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని బిజెపి అధిష్టానం పట్టుదలగా ప్రచారం చేసింది. నితీష్ కుమార్ వరుసగా ఏడోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి ఆయన బీహార్ సిఎంగా ఉన్నారు. ఈ నెల 16న ఆయన మరోసారి బీహార్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.Celebrating note ban akin to cut cakes on victims' graves: Shiv Sena - The  Financial Express

దీనిపై శివసేన పార్టీ తమ అధికార పత్రిక సామ్నాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాని మౌత్ పీస్ సామ్నాలో నితీష్ కుమార్ పై విరుచుకుపడింది. ఆయన పార్టీ పార్టీ 3 వ స్థానంలో ఉన్నప్పటికీ ఆయనకు సిఎం పదవి ఇస్తే, అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆరోపించింది. బౌట్ కోల్పోయిన మల్ల యోధుడికి బంగారు పతకం ఇవ్వడంతో సమానం అంటూ పోల్చింది.