మళ్లీ ఒకటవుతున్న ఐపీఎల్ ప్రత్యర్థులు

-

ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా తలపడిన ఆటగాళ్లు మళ్లీ ఒకటి కానున్నారు. కరోనా తర్వాత టీమిండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్‌కు సిద్ధమైంది. యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు టీమిండియా పయనమవ్వనుంది. నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్‌కు సంబంధించిన జట్లను బీసీసీఐ ప్రకటించింది.

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జంబో జట్టు ఇవాళ దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఆటగాళ్లందరూ సిడ్నీ నగరంలో క్వారంటైన్‌లో ఉండనున్నారు. అక్కడే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆటగాళ్లు సాధన చేయనున్నారు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటు పలువురు భారత క్రికెటర్లు ఇప్పటికే టీమ్‌కు సంబంధించిన బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టారు. ముంబై, ఢిల్లీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత చివరి బ్యాచ్‌ ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ముంబై జట్టుతో భారత్‌కు రానున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేసిన భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టెస్ట్‌ జట్టులో చోటు కల్పించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పితృత్వ సెలవు మంజూరు చేశారు. దాంతో తొలి టెస్ట్‌ తర్వాత అతడు భారత్‌కు తిరిగి రానున్నాడు. అంటే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లోని మూడు టెస్ట్‌లు దూరమవనున్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరి మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వనుంది. 2018లో ఆసీస్‌ పర్యటన సందర్భంగా రోహిత్‌ ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నాడు. అయితే ఆడిలైట్‌ టెస్ట్‌ తరవాత కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చేస్తాడు. మిగిలిన టెస్ట్‌లకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news